హైదరాబాద్: నగరంలోని గగన్ పహాడ్ పరిసరాల్లో చిరుత తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో చిరుతను కనిపెట్టడానికి అధికారుల వేట కొనసాగుతోంది. అధికారులు చిరుతను గాలిస్తుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.
రాత్రి సమయంలో ఎవరూ ఒంటరిగా బయట తిరగవద్దని పోలీసులు స్థానికులకు సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చిరుతలు జనావాసాల్లోకి వస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నల్లగొండలో ఓ చిరుతను ఫారెస్టు అధికారులు చాకచక్యంగా బంధించారు.