FbTelugu

మూడు ఆసుపత్రులపై తనిఖీలు

గుంటూరు: నర్సరావుపేట లోని మూడు ఆసుపత్రులలో ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, డ్రగ్ కంట్రోల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం అధికారులు ఇవాళ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

కరోనా పాజిటివ్ చికిత్స పొందుతున్న రోగుల వద్ద ఫీజు రోజుకి ఎంత వసూలు చేస్తున్నారు, రెమిడెసివిర్ స్టాక్ వినియోగం, ఆక్సిజన్ నిల్వలు మొదలైన పలు అంశాలపై ఆరా తీశారు. కొంత మంది రోగుల వద్ద రోజుకి రూ.20,000 – 25,000 వరకు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేసినా, రెమిడెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ పైనా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం 8008203288 నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఎవరు ఫిర్యాదు చేసినా వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరిగుతుందన్నారు. ఇవాళ నర్సరావుపేటలోని 1. పువ్వాడ హాస్పిటల్ 2. మదర్ థెరిసా హాస్పిటల్ 3. సాయి తిరుమల హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. రెమిడెసివిర్, ఆక్సిజన్ అధిక మొత్తం లో నిల్వ ఉంచినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కేసులు నమోదు చేసి జైలు కు పంపిస్తామని అధికారులు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.