FbTelugu

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలులో తనిఖీలు

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల అడ్మిషన్లు, స్కూలు అక్కౌంట్ పుస్తకాలు, రశీదు పుస్తకాలను సీజ్ చేశారు.
ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఎప్పటి మాదిరే ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇవాళ స్థానిక డిప్యూటీ ఈఓ తనిఖీ చేసేందుకు వెళ్లగా ప్రధాన గేటు వద్దే జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నది. అధిక ఫీజులపై పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు రావడంతో వచ్చినట్లు ఆయన చెప్పినప్పటికీ లోనికి అనుమతించలేదు.
ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కి డిప్యూటీ ఈఓ తెలిపాడు. ఇద్దరు అధికారులు స్కూలు వద్దకు చేరుకుని డిప్యూటీ ఈఓ ను తీసుకుని లోనికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అక్కౌంటెంట్లను విచారించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు పారదర్శకంగా నిర్వహించడం లేదని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిగతా డాక్యుమెంట్లు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ స్కూలుతో పాటు బేగంపేటలోని గీతాంజలి స్కూలు, మెరిడియన్ స్కూలు, నీరజ్ పబ్లిక్ స్కూలులో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.