FbTelugu

గూగుల్, అమెజాన్ లకు చెక్

సిద్ధమవుతున్న ఈ కామర్స్ రెగ్యులేటరీ
ఢిల్లీ: ప్రముఖ సెర్చింజన్ గూగుల్, ఈ కామర్స్ అమెజాన్ కు మూకుతాడు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టానిక స్టార్టప్ లను ఊతమిచ్చేందుకు ఈ కామర్స్ విధానానికి మెరుగులు దిద్దుతోంది.
అంతర్జాతీయ టెక్ దిగ్గజాలను నియంత్రించి, ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూపొందించింది. సమాచార వనరులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పరిశ్రమలో పోటీ వాతావరణం పెంపొందించేలా రెగ్యులేటరీని ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో 50 కోట్ల డిజిటల్ యూజర్లతో ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న క్రమంలో ఆన్ లైన్ రిటైల్, కంటెంట్ స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపుల్లో గ్లోబల్ కంపెనీల గుత్తాధిపత్యమే ఉంది. చైనా యాప్ లను నిషేధించిన క్రమంలో గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించాలనే నినాదం ఊపందుకోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. వీటికి మూకుతాడు వేసేందుకు ఈ కామర్స్ రెగ్యులేటరీ ముసాయిదా రూపకల్పన చేశారు. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయం సేకరించనున్నారు.

You might also like