FbTelugu

వినూత్న రీతిలో మిడతలకు చెక్

జైపూర్: ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్థాన్ మీదుగా కోట్ల సంఖ్యలో భారత్ కు వస్తున్న మిడతలతో రైతాగం విలవిలలాడి పోతోంది. మిడతలను తరిమికొట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రభావం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు.

తాజాగా రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ లోకి మిడతలు ప్రవేశించాయి. దీంతో అక్కడి రైతులు అధికారుల సూచనల మేరకు డీజే సౌండ్ తో పాటలను పెట్టి మిడతలను తరుముతున్నారు. ఈ విధానం మంచి ఫలితాన్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పెద్ద సౌండ్లకు మిడతలు బెదిరిపోతున్నట్టు తెలిపారు.

You might also like