FbTelugu

బంగారం మోసాలకు చెక్

న్యూఢిల్లీ: దేశంలో బంగారు వ్యాపారుల మోసాలకు చెక్ పడింది. మంగళవారం నుంచి హాల్ మార్క్ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ నిబంధనతో కొనుగోలుదారుకుల స్వచ్ఛమైన బంగారం లభ్యం కానున్నది.
రెండు దశాబ్ధాల క్రితమే హాల్ మర్క్ ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఖరారు చేసింది. అప్పటి నుంచి కొన్ని దుకాణాలు అమలు చేస్తుండగా మెజారిటీ దుకాణాలు అమలుపర్చడం లేదు.

హాల్ మార్కింగ్ సదుపాయాలు లేవంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ విధానం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా జూన్ 1వ తేదీ కి వాయిదా వేశారు. మళ్లీ గడువు పొడించాలని జ్యూయల్లర్ వ్యాపారులు కొరగా ప్రభుత్వం జూన్ 14 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 15వ తేదీ నుంచి హాల్ మార్క్ విధానం అమలవుతోంది. ఈ ప్రమాణాల ప్రకారం హాల్ మార్క్ ఉన్న 14, 18, 22 క్యారెట్ల బంగారం లేదా ఆభరణాలు మాత్రమే విక్రయించాలి. ప్రతి నగ పై హాల్ మార్క్ గుర్తుతో పాటు 14 లేదా 18, 22 క్యారెట్లను స్పష్టంగా తెలపాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.