* మొబైల్ ఓటీపీతో రేషన్ పంపిణీ
* వచ్చే నెల నుంచి అమలు
* ఆధార్ తో ఫోన్ నంబర్ అనుసందానం తప్పనిసరి
హైదరాబాద్: తెలంగాణలో ఇక నుంచి రేషన్ పంపిణీలో మోసాలకు చెక్ పెడుతూ.. పంపిణీలో తలెత్తే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే అమలు చేయనుంది.
తాజా విధానంతో లబ్ధిదారులు రేషన్ సరుకులను పొందాలంటే మొబైల్ ఓటీపీ తప్పనిసరి కానుంది. ఇందుకు గానూ ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసందానం చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది.