FbTelugu

టీవీ యాంకర్ కార్తీకపై చీటింగ్ కేసు

హైదరాబాద్: టీవీ యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకెళితే.. కత్తి కార్తీక తమకు మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లో 52 ఎకరాల స్థలంలో కొంత వాటా ఉందంటూ.. బంజారాహిల్స్‌కు చెందిన టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ దొరస్వామికి ఆ భూమిని రూ. 35 కోట్లకు విక్రయిస్తామని, కోటి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని కోరింది.

అది నిజమేనని నమ్మిన దొరస్వామి కత్తి కార్తీకతోపాటు ఇతరుల ఖాతాల్లోకి డబ్బు జమ చేశాడు. అయితే కార్తీక తమదని చెబుతున్న భూమి సిప్లా రమేశ్ అనే వ్యక్తిదని తెలియడంతో దొరస్వామి నిర్ఘాంతపోయాడు. దీంతో తనని కత్తి కార్తీక మోసం చేసిందని ఆమెతో పాటూ పలువురిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చీటింగ్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.