FbTelugu

భవ్యాస్ బిల్డర్ ఆనంద్ పై చీటింగ్ కేసు

హైదరాబాద్: భవ్యాస్ బిల్డర్ అధినేత వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ (భవ్యాస్ ప్రసాద్) పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. గతంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఆయనతో పాటు కుమారుడు, కోడలిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామచంద్రాపురం పోలీసుల కథనం ప్రకారం.. భవ్యా కన్ స్ట్రక్షన్ అధినేత, సినీ నిర్మాత వెనిగళ్ళ ఆనందప్రసాద్ తనను మోసం చేశాడంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. ఆనంద్ ప్రసాద్ 2017 లో కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ, దానికి గాను నాలుగు శాతం లాభాలు ప్రతి సంవత్సరం తిరిగి ఇస్తామని చెప్పాడు. అతని మాటను నమ్మి తన దగ్గర రూ.2 కోట్లు తీసుకొని హామీ ప్రకారం అసలు ప్రతిఫలం ఇవ్వకుండా దాట వేస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలని తిరిగి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినందున ఆర్థికంగా నష్టపోయానని, తనకు కొంత సమయం ఇవ్వాలని అడిగాడు. తనకు బాచుపల్లి, బౌరంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని చెప్పాడు. విక్రయించి అయినా డబ్బులు ఇస్తాను లేదా మీపేరు పై  భూమి రిజిస్ట్రేషన్ చేస్తానంటూ కొన్నాళ్ళు గడిపారని అన్నాడు. నెలలు అవుతున్నా దాటవేశాడు తప్పితే డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీశాడు. నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా చంపుతామని బెదిరించడంతో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం మోసం చేసిన వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్, అతని భార్య, కుమారుడు, కోడలు, శివ కుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కుమారుడు, కోడలిని అరెస్ట్ చేసి మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు రామచంద్రాపురంలో పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.