FbTelugu

తక్కువ ధరకే బంగారమంటూ టోకరా

విశాఖపట్నం: విశాఖ మధురవాడ దోపిడీ ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ.. కోటేశ్వరరావు అనే ఓ వ్యక్తిని నమ్మించి అతడు డబ్బు లెక్కబెడుతుండగా.. సినీ ఫక్కీలో పోలీసుల సైరన్ వేసుకొచ్చి లక్షల రూపాయలను దోచుకెళ్లినట్టు గుర్తించినట్టు తెలిపారు.

సీసీ పుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ సూచించారు.

You might also like