FbTelugu

డ్రగ్స్ కోసం తల్లి ఫోన్ తో ఛాటింగ్

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో జైలుకెళ్లిన నటి రియా చక్రవర్తి మరిన్ని చిక్కుల్లో పడుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో తన తల్లి మొబైల్ ఫోన్ విషయాన్ని వెల్లడించింది.
తల్లి సంద్యా చక్రవర్తి మొబైల్ నెంబర్ తో వాట్సప్ గ్రూపులకు కనెక్ట్ అయ్యానని, ఆ నెంబర్ తోనే స్నేహితులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది.

ఈ విషయాన్ని ఒక జాతియ మీడియా వెలుగులోకి తెచ్చింది. అన్ని మొబైల్ ఫోన్లను అప్పగించిన రియా తన తల్లి ఫోన్ ను మాత్రం ఇప్పటి వరకు అప్పగించలేదు. రియా వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె తల్లి ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెంబర్ ద్వారా ఎవరెవరితో ఛాటింగ్ చేసింది, ఏం చేసిందనేది విచారిస్తున్నారు. డ్రగ్స్ విషయంలో ఆమె ఛాటింగ్ చేసిన వారికి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరి పేర్లు ఉన్నాయనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు.

You might also like