FbTelugu

నగ్నంగా ఛాటింగ్… రూ.1.5 లక్షలు లూటీ

హైదరాబాద్: ఫేస్ బుక్ మాయలో పడి సైబర్ చీటర్స్ పంపిన రిక్వెస్ట్ కు ఓకే చెప్పాడు. ఆ తరువాత నగ్నంగా ఛాట్ చేయించారు. అది రికార్డు చేసిన చీటర్స్ సదరు వ్యక్తి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీ కి చెందిన అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి సైబర్ చీటర్స్ వలపు వల విసిరారు. ఫేస్ బుక్ పేజీలో ఒక లేడీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపింది. నిజమేననుకుని ఖరీం అంగీకరించాడు. తర్వాత మెసెంజర్ చాటింగ్ తో ముగ్గులోకి లాగి..నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేలా చేసి స్క్రీన్ రికార్డు చేసింది. ఆ వీడియోను అతనికి పంపించి డబ్బుల కోసం బెదిరించగా భయపడిన ఖరీం రూ.1.5 లక్షలు పంపించాడు. ఇంకో రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఖరీం సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.