FbTelugu

ఛార్టెడ్‌ అకౌంటెంట్ పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఏఐ) విద్యార్థుల కోసం కీలక ప్రకటన చేసింది. మే నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన ఛార్టెడ్‌ అకౌంటెంట్ ఫైనల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

దీంతో పాటు 22 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్‌ పరీక్షలను కూడా వాయిదా వేసింది. కరోనా మహమ్మారి దృష్ట్యా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసిఏఐ తెలిపింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత పరిస్థితులు సమీక్షించుకొని కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. పరీక్షల తేదీలను కనీసం 25 రోజుల ముందుగానే విద్యార్థులకు తెలియచేస్తామని ఐసిఏఐ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.