FbTelugu

ఫిబ్రవరిలోపే అంతర్వేదిలో రథం నిర్మాణం

దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌వాడ‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఆ లోపే రథం సిద్ధం చేస్తామని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

కల్యాణోత్సవాల లోపే అంద‌రి అభిప్రాయంల మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు ఆయన చెప్పారు. సొమ‌వారం దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌తో స‌మావేశం అయినట్లు శ్రీనివాస్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందని ఆయన అన్నారు.

రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారని మంత్రి తెలిపారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారని ఆయన వివరించారు. త్త రథం నిర్మాణంతో పాటు… ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జ‌రిగింద‌ని మంత్రి శ్రీనివాస్ అన్నారు.

You might also like