FbTelugu

ఆంగ్ల బోధనలో మార్పులు

Changes-in-the-teaching-of-English

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించబోతున్న నూతన ఆంగ్లమాధ్యమంలో బోధన నిర్ణయంలో పలు మార్పులను తీసుకొచ్చింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలో బోధించాలన్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పల్ప మార్పు చేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆరో తరగతి వరకూ మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్‌ సూచించారు. దీనిపై శనివారమే అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

You might also like