FbTelugu

పీఠాధిపతి ఎంపిక ప్రత్యేకాధికారిగా చంద్రశేఖర్ ఆజాద్

విజ‌య‌వాడ‌: కడప జిల్లా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెలంపల్లి మూడు రోజుల క్రితం కందిమల్లయ్యపల్లె లో పర్యటించిన విషయం తెలిసిందే. పీఠాధిపతి నియమాకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి వెలంపల్లి సూచించారు. పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను ధార్మిక పరిషత్తు నియమించింది. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వెలంపల్లి సూచించారు.

శ్రీ వీరభోగ వంసత వేంకటేశ్వర స్వామి ఇరువురు సంతానంతో మంత్రి శ్రీనివాస్ చర్చించారు. మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించగా, ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. మఠం పీఠాధిపతిగా పెద్ద కొడుకుగా వంశపారంపర్యగా నేనే అర్హుడిని అని పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి అంటుండగా, అమ్మకి కిడ్నీ దానం చేశాను, వీలునామా ప్రకారం తనకే పీఠాధిపతి ఇవ్వాలని రెండొ కుమారుడు వీరభద్రస్వామి పట్టుబడుతున్నారు. వివాదం మొదలై దాదాపు నెల రోజులు అవుతున్నా కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదరడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.