FbTelugu

కుప్పంలో బాబు పర్యటన ముగిసింది

చిత్తూరు: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజుల పర్యటన ముగిసింది. ఇవాళ కుప్పంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శ్రేణులు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎత్తి చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కుప్పం వచ్చి పర్యటించి వెళ్తానని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అమరావతి రావాలని ఆయన కార్యకర్తలను కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ కార్యకర్తల వ్యవహార శైలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చంద్రబాబు సీనియర్ నాయకులతో సమాలోచనలు జరిపారు. పర్యటన ముగియడంతో ఇవాళ చంద్రబాబు బెంగళూరు ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని జుబ్లిహిల్స్ నివాసానికి వెళ్తనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.