FbTelugu

చంద్రబాబు పేరు చేర్చాల్సిందే: ఏపీ హైకోర్టు

అమరావతి: రాష్ట్ర భద్రతా కమిషన్ (ఎస్సెస్సీ) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు పేరు నమోదు చేసి నెల రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్ర భద్రతా కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను  స్వీకరించిన ధర్మాసనం ఇవాళ విచారించింది. వాదోపవాదనల తరాత కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని  తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.