FbTelugu

జగన్ ను విష్ణుమూర్తితో పోల్చడం పాపం: చంద్రబాబు

తిరుమల: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని మహా విష్ణువు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ప్రధాన అర్చకులు ఏవి.రమణ దీక్షితులు పోల్చడం సరికాదని టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఖండించారు.

మనిషిని దేవుడితో పోల్చడం మంచి పద్దతి కాదని, ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేసారని, వారికి ఏ గతి పట్టిందో ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఇవాళ రేణిగుంట చేరుకున్న తరువాత చంద్రబాబు నేరుగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట ప్రజలకు శుభం కలగాలని, ప్రజలు ఆరోగ్యంగా వుండాలని దేవుణి ప్రార్దించాను అని చంద్రబాబు తెలిపారు. రాష్ర్టానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు… శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరి పై వుందన్నారు. పింక్ డైమండ్ పోయిందంటూ టిడిపి పాలనలో లేనిపోని ఆరోపణలు చేసిన అర్చకుడిని తిరిగి ప్రధాన అర్చకుడిగా చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.