FbTelugu

ఆ భూములు ఎలా లాగేసుకుంటారు? : చంద్రబాబు

అమరావతి: గత ప్రభుత్వం ఇచ్చిన భూములు ఎలా లాగేసుకుంటారని అధికారులను చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇవాళ తమ భూములను పట్టాలు లేవన్న కారణంలో లాగేసుకున్నారని కుప్పం తహశీల్దార్ కార్యాలయం వద్ద లబ్దిదారులు, టీడీపీ నేతలు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇళ్లస్థలాలను పట్టాలు లేవంటూ స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ సమస్యపై కుప్పం తహశీల్దార్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ బాధితులతో, చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ప్రభుత్వానికి అవసరాలకు నిర్ధేశించిన భూమి కాబట్టే.. స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.