FbTelugu

శేషన్ మృతికి బాబు, జగన్ సంతాపం

అమరావతి:కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి టి.ఎన్‌. శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్‌ నిలువుటద్దమని, పబ్లిక్‌ సర్వెంట్‌గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్‌ నిరూపించారని జగన్‌ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అన్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్. శేషన్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శేషన్ భారత ప్రజాస్వామ్యానికి నూతన జవసత్వాలు కల్పించారు. ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎన్నికల కమిషన్ ను బలోపేతం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ, విధి నిర్వహణలో నిబద్దత, నిజాయితీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశాయి. దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ టిఎన్ శేషన్. సమకాలీన యంత్రాంగానికి శేషన్ మార్గదర్శకుడు కావాలి. శేషన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

You might also like