FbTelugu

ఇసుకపై చంద్రబాబు దీక్ష

Chandrababu-initiation-on-the-sand

అమరావతి: ఏపీలో ఇసుక కొరత, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఈనెల 14న ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడు ఒకరోజు దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనున్నది. ఇసుక కొరతపై ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని, భవన నిర్మాణంపై ఆధారపడిన కార్మికులు మరణిస్తున్నా చలనం లేకపోవడంతో దీక్ష చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీక్షకు ఏర్పాట్లు చేయాల్సిందిగా టీడీపీ రాష్ట్ర నాయకత్వాన్ని చంద్రబాబు ఆదేశించారు మరుసటి రోజు గుంటూరులో టీడీపీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం ఉండనున్నది.

You might also like