FbTelugu

బాసరలో చంద్రబాబు మనవడికి అక్షరాభ్యాసం

నిర్మల్: బాసర సరస్వతి అమ్మవారి దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ కు అక్షరాభ్యాసం చేశారు. నారా బ్రాహ్మణి తల్లి నందమూరి వసుధర, ఇతర బంధువులతో కలిసి ఆలయానికి వచ్చారు.

ఆలయ మర్యాదలతో అధికారులు నారా బ్రాహ్మణి, బంధువులకు స్వాగతం పలికారు. పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్, ఆయన భార్య తేజస్విని కూడా వచ్చారు. తేజస్విని, భరత్ దంపతుల కుమారుడు ఆర్యన్ కు కూడా అక్షరాభ్యాసం చేయించారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అక్షరాభ్యాసం కార్యక్రమానికి రాలేకపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.