FbTelugu

అరాచక పాలన రాజ్యమేలుతోంది: చంద్రబాబు

అమరావతి: ఏపీలో వైసీపీ అరాచక పాలన రాజ్యమేలుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తంబళ్లపల్లెలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేశారంటూ.. చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు లేవనెత్తారు.

వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నా పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారని చెప్పారు. ఈ చర్యలు ఇలాగే కొనసాగుతూ పోతే ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.