FbTelugu

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆగడాలపై ఆయన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రునిపై నిర్భయ కేసు నమోదు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లేఖలో డా.సుధాకర్, డా.అనితారాణి కేసులపై కూడా ప్రస్తావించాడు.

You might also like