FbTelugu

ఆంధ్రాలో గో పూజ డ్రామా: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రాలో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి గో పూజ డ్రామా ప్రారంభించారని ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రిషికేష్ వద్ద నదిలో జగన్ మున డ్రామా జనం మరిచిపోలేదన్నారు.
విశాఖపట్నం ఏయిర్ పోర్టులో కోడికత్తి కేసు, మాజీ ఎంపీ వైఎస్. వివేకానంద రెడ్డి కేసు ఎలా చేశారో చూశామని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సొంత బాబాయిని రాక్షసంగా హత్య చేస్తే గుండెపోటుగా ప్రచారం చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారన్నారు. దానిని కూడా టీడీపీకి అంటించాలని కుట్రలు చేశారన్నారు. మొన్న విజయనగరం జిల్లా రామతీర్థం దుర్ఘటనలో సూరిబాబుపై ఆరోపణలు చేశారని చంద్రబాబు అన్నారు. దుశ్చర్యకు పాల్పడింది ఒప్పుకోవాలని ఆయనను భౌతికంగా హింసించారని చంద్రబాబు ఆరోపించారు.

రాష్ట్రంలో దాడులు, విధ్వంసాలను నియంత్రించడం చేతగాక టీడీపీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు అన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడింది వైసీపీ వాళ్లు అయితే, ఆ దాడులు, విధ్వంసాలను బైటపెట్టింది టీడీపీ అని ఆయన వివరించారు. దేవాలయాలపై దాడులు చేసిన వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పిస్తారా..? దేవుడిపై భక్తితో ఈ దాడులను బైటపెట్టిన వాళ్లపై కేసులు పెడ్తారా..? విధ్వంసాలు చేసిన వైసీపీ వాళ్లపై కేసులు లేవా..? అని ఆయన నిలదీశారు. రామతీర్థం సందర్శించిన తనపై, మాజీ మంత్రులు కె.అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. మాకన్నా గంట ముందు రామతీర్థం వెళ్లి రెచ్చగొట్టిన వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, వైసీపీ నాయకులపై కేసులు పెట్టరా అని చంద్రబాబు నాయడు సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.