FbTelugu

కుప్పంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన

చిత్తూరు: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు అయ్యింది. గురువారం (రేపు) బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా కుప్పం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల నడుమ గుడిపల్లి మండల కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

మధ్యాహ్నం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు కుప్పం రురల్ మండలం కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రజల వద్దనుంచి వినతులు స్వీకరిం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకుప్పం మండల కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతిపురం కార్యకర్తలతో భేటీ అయి రాత్రి కుప్పంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉంటారు. శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుప్పం మునిసిపాలిటి కార్యకర్తలతో, మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారు. 4 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడకు రాత్రికి చేరుకుంటారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.