FbTelugu

బాబు పిటీషన్ పై కొనసాగుతున్న వాదనలు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పిటిషన్లపై ఏపీ హైకోర్టు లో విచారణ జరుగుతోంది.
సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరికాదంటూ ఇద్దరూ వేర్వేరు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్ర వాదనలు విన్పించారు. మాజీ మంత్రి నారాయణ తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు విన్పిస్తున్నారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం ఆయుధంగా ఉపయోగించుకుంటున్న ఈ కేసులో.. అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును చంద్రబాబు కోరారు. అవినీతిపై గొంతెత్తకుండా చేసేందుకు.. ప్రతిపక్షాన్ని భయపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిద్దార్థ్ లూత్ర కోర్టు దృష్టికి తెచ్చారు.

అక్రమ పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులను కేసుల్లో ఇరికించడం, విచారణ పేరుతో వేధించడాన్ని గతంలో కోర్టులు తప్పుబట్టాయని.. వాటన్నింటిని కొట్టివేశాయని గుర్తుచేశారు. ఈ నెల 12న సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు కొట్టియాలని కోరారు. అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. సీఆర్డీఏ రద్దు చేస్తూ జీఓ ఇచ్చిన తరువాత ఇంకా ఈ కేసులో బలం ఏమున్నదని వాదించారు. అసైన్డు రైతులకు న్యాయం కోసం జీఓ 41 తెచ్చారు. అసైన్డు భూముల నుంచి ఎవరినీ పంపించలేదన్నారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ అధికారులు అడిగితే ఈ జీఓ తెచ్చారని సిద్ధార్థ తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.