FbTelugu

హైకోర్ట్ తీర్పుపై డివిజన్ బెంచ్ లో సవాల్

అమరావతి: ఏపి ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచి జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ కు, డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ఈ మధ్య పరిపాటిగా మారింది. జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది.
ఏపిలో 2020 మార్చి లో జరిగిన జెడ్పిటిసి , ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల సమయంలో 126 జెడ్పిటిసి స్థానాలు, 2371 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని ప్రభుత్వం అంటోంది. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. హైకోర్ట్ తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్లు భావించాలని ప్రభుత్వం చెబుతోంది. అంతకు ముందు జరిగిన నామినేషన్లు చెల్లుబాటులో ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ రద్దుపై డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.