FbTelugu

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

హైదరాబాద్: ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌ తో 2016లో వివాహం జరిగింది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌ మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

పనులు ముగిసిన తరువాత భర్త సిద్ధార్థ్ బుధవారం రాత్రి ఇంటికొచ్చాడు. గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన శిరిష్మను చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె మృతి పై విచారణ జరపాలని చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.