FbTelugu

మోదీ గెడ్డం గీయించుకో.. రూ.100 పంపిన ఛాయ్ వాలా!

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్య వైఖరి సామాన్యులకు సైతం చికాకు తెప్పిస్తున్నది. ఛాయ్ వాలా అని చెప్పుకుంటున్న మోదీకి మరో ఛాయ్ వాలా అనిల్ మోరె గట్టి షాక్ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ దేశం లో ప్రవేశించిన నాటి నుంచి వైరాగ్యంతో ఉన్నారు. గెడ్డం గీయించుకోకుండా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది చూసిన ఒక ఛాయ్ వాలా అనిల్ మోరె తన అసంతృప్తి గళాన్ని విప్పాడు. అనిల్ ది మహారాష్ట్రలోని బారామతి నగరం. మోదీకి రూ.100 పంపించి, గెడ్డం గీయించుకోవాలని సూచన పడేశాడు. పిఎం నరేంద్ర మోదీ గెడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకనుంచి ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలన్నారు. దేశ జనాభాకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించాలన్నారు. ప్రజల కోసం వైద్య సదుపాయాలు పెంచాలి. రెండు లాక్ డౌన్ లతో ప్రజల ఇళ్లు, వాకిలి ఆగమైపోయిందని, ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు దృష్టి సారించాలని కోరారు.

మోదీ అంటే తనకెంతో గౌరవం అంటూనే తను దాచుకున్న డబ్బుల్లోంచి ఆయనకు రూ.100 పంపిస్తున్నాని తెలిపాడు. కరోనా కారణంగా పదిహేను నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం. అయినా మోదీ గెడ్డం గీయించుకునేందుకు డబ్బులు ఇస్తున్నాను. ఆయనను అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు పడుతున్న బాధలు తెలియచేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు అనిల్ మోరె తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.