FbTelugu

ప్రతి పార్టీకో మీడియా సంస్థ: హక్కుల కమిషన్ ఛైర్మన్

హైదరాబాద్: ఇపుడు ఒక్కో రాజకీయ పార్టీలకు ఒక్కో మీడియా సంస్థ ఉందని, న్యాయమూర్తులు నేటి వార్తలను నమ్మడం లేదని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు.
ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జస్టిస్ చంద్రయ్య టియుడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్ట్ లు సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. సమాజం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పాలక వర్గానికి రాజ్యాంగం పై అవగాహన, అధ్యయనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

పత్రిక రంగం ఒక విశ్వవిద్యాలయం.. అనేక మంది విద్యావేత్తల సమ్మేళనం అని గుర్తు చేశారు. సమాజానికి దశ దిశ నిర్ణయయించేది పత్రికలేనని ఆయన స్పష్టం చేశారు. మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు మనిషి జీవించడానికి ఇవి ప్రధాన అంశాలన్నారు. వీటిని హరించే హక్కులు అధికారులకు, పాలకులకు లేవన్నారు. చట్టపరమైన హక్కులు, మానవ హక్కులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పత్రిక రంగంలో సవాళ్ళను ఎదుర్కొనేందుకు జర్నలిస్ట్ సంసిద్దంగా ఉండాలని చంద్రయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.