FbTelugu

20 నిమిషాల్లో అంబూలెన్స్: ఏపీ ఆరోగ్య శ్రీ

విజయవాడ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108,104 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జునరావు తెలిపారు.
జులై 1వ తేదీన సీఎం వైఎస్.జగన్ వీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారని ఆయన వివరించారు. ప్రతి వాహనంలో వెంటిలేటర్, ఇన్ ఫుజాన్ పుంప్స్, సిరంజి పుంప్స్ ఉంటాయన్నారు. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో పెడుతున్నామని మల్లికార్జున రావు చెప్పారు. రూ.203.47 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశామన్నారు. మండలనికో 104 వాహనం అందుబాటులో ఉంచుతామన్నారు.

108 వాహనాలు 412 సిద్ధం కాగా, అడ్వాన్స్ లైఫ్ సపోర్టు వాహనాలు 104 ఉంటాయన్ననారు. లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282, 104 వాహనాలు 676 అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదం జరిగిన 20నిమిషాల్లో వాహనం వెళుతుందని మల్లికార్జున రావు వివరించారు. పట్టణ ప్రాంతంలో15 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతంలో 25 నిమిషాల్లో వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

You might also like