హైదరాబాద్: నేడు గాంధీ ఆస్పత్రిని కేంద్ర బృందం సందర్శించనుంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే..
ఈ కేంద్ర బృందం లవ్ అగర్వాల్ నేతృత్వంలో ఇవాళ రాష్ట్రంలోని పలు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇదే సమయంలో గాంధీ ఆస్పత్రి, టిమ్స్ ఆస్పత్రి, దోమల్గూడా కంటైన్మెంట్ జోన్లు పరిశీలించిన తర్వాత సచివాలయంలో వైద్యారోగ్య అధికారులతో సమావేశం జరుపనున్నారు.