FbTelugu

నేడు హైదరాబాద్ కు కేంద్ర బృందం

హైదరాబాద్: కేంద్ర బృందం ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానుంది. ఈ కేంద్ర బృందంతో పాటూ కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా విచ్చేయనున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర బృందం రాష్ట్ర ఆరోగ్యశాఖాధికారులతో భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. రేపు కంటైన్మెంట్ క్లస్టర్లు, ల్యాబ్ లు, ప్రైవేట్ ఆస్పత్రులను కేంద్ర బృందం పరిశీలించనుంది.

You might also like