FbTelugu

డెక్సామెథాసోన్ కు కేంద్రం పచ్చజెండా

ఢిల్లీ: కరోనా వైరస్ తో బాధపడుతతూ వెంటిలేటర్ పై ఉన్నవారికి డెక్సా మెథాసోన్ టాబ్లెట్లు ఉపయోగించేందుకు కేంద్రం ప్రభుత్వం సమ్మతించింది.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రమే ఈ మందు వినియోగించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఆర్థరైటీస్, ఆస్తమా వంటి తీవ్ర వ్యాధిగ్రస్తులకు ఈ మందును వినియోగిస్తున్నారు. ఇక నుంచి వెంటిలేటర్ పై ఉన్నవారికి దీన్ని ఉపయోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ కావాల్సిన సమయంలో ఎక్కువ ధరతో కూడి మిథైల్ ప్రిడ్ని సోలోన్ ను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఇది అధిక ధరతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో దీనిని వినియోగించడం లేదు.

డెక్సా మెథాసోన్ పై ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం అనేకసార్లు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం ఆసుపత్రుల్లో చేరిన రెండు వేల మంది రోగులకు డెక్సా మెథాసోన్ మందును ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి ఉపయోగించగా 35శాతం మరణాలు తగ్గాయి. దీంతో ఉత్పత్తి పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దేశాలకు పిలుపునిచ్చింది.

You might also like