FbTelugu

అపెక్స్ మీట్ పై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ

న్యూఢిల్లీ: వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలోనే నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదుల నీటి వాడకంపై నెలకొన్న తాజా వివాదాలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల (ఆగస్టు) 25వ తేదీన జరిపేందుకు ఖరారు చేయగా.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కి కరోనా సోకడంతో ఈ సమావేశం వాయిదా పడింది. అయితే సమావేశమయ్యే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.

You might also like