FbTelugu

తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయ

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మొట్టికాయ వేసింది. ఇటీవల కాలంలో తెలంగాణలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు వలస కూలీల నుంచి ఈ ముప్పు ఎక్కువ ఉంది.

ఇప్పుడు వైరస్‌ సోకే స్థాయినుంచి మరణాలు పెరిగే స్థాయికి చేరుకుంది. అయినా, రాష్ట్రం కరోనా టెస్టుల విషయంలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోందన్న విమర్శలు రాజకీయ వర్గాల నుంచి ప్రజల దాకా వినిపిస్తున్నాయి. టెస్టులతోనే కరోనా కట్టడి చేయవచ్చని వైద్యరంగాలు కూడా సూచిస్తున్నాయి. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటూ తప్పించుకుంటోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే చేశారని, కరోనాపై నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం టెస్టులు చేయాలని తేల్చి చెప్పింది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువ టెస్టులు జరుగుతున్నాయని కేంద్రం విమర్శలు చేసింది. సో, ఇప్పటికైనా తెలంగాణ సర్కారు స్పందిస్తుందో.. లేదో మరి. సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకొని టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.