FbTelugu

రూ.15వేల లోపు ఉద్యోగుల పీఎఫ్…

హైదరాబాద్: ప్రైవేటు కంపెనీలలో పనిచేసే సగటు వేతన జీవులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

నెలకు రూ.15వేల లోపు వేతనం పొందుతున్న ఉద్యోగుల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే వచ్చే మూడు నెలలు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేస్తున్న 72 లక్షల మంది ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూర్చుతుందన్నారు.

టీడీఎస్ పరిధిలోకి వచ్చేవారి కోసం…

అదే విధంగా టీడీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కూడా మేలు కలిగే ఉద్దీపన ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్ లో 25 శాతం మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం లభించనుందన్నారు. గతేడాది 2019-20 ఐటీ దాఖలుకు గడువును నవంబర్ 30 వరకు పొడిగించామని ఆమె తెలిపారు.

You might also like