FbTelugu

ఈరోజైనా రైతుల చర్చలు కొలిక్కి వచ్చేనా…!

ఢిల్లీ: విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనున్నది. ఇప్పటి వరకు కేంద్రం, రైతుల మధ్య 11 సార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు.

తాజా చర్చల్లో ఏడాదిన్నరపాటు సాగు చట్టాలు అమలు నిలిపివేస్తామని కేంద్ర మంత్రులు చెప్పినా రైతులు పట్టించుకోలేదు. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు సున్నితంగా తిరస్కరించాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తరువాతే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్దామని రైతులు ఆల్టిమేటం ఇచ్చారు. దీంతో చర్చలు ఇవ్వాల్టికి వాయిదా పడ్డాయి. ఈ రోజు జరిగే చర్చలు కొలిక్కి వస్తాయో లేదో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.