FbTelugu

వ్యాక్సిన్ల కోసం భారీ ఆర్డర్లు: కేంద్రం ప్రభుత్వం

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల విషయంలో కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించిన మరుసటి రోజే భారీగా ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించింది.
25 కోవిషీల్డ్ డోసులు, 19 కోట్ల కోవాగ్జిన్ డోసులు కొనుగోలు చేస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వికె.పాల్ తెలిపారు.

ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే రెండు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది అదనమని ఆయన వివరించారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి మొత్తం 44 కోట్ల డోసులు డిసెంబర్ కల్లా ప్రతి నెలా కొంత చొప్పున సరఫరా చేస్తారన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బయాలాజికల్ ఈ తయారు చేస్తున్న కార్బ్ వ్యాక్స ను కొనుగోలు చేస్తున్నామని, 30 కోట్లో డోసులకు ఒప్పంద కూడా జరిగిందన్నారు. అయితే ధరలపై ఇంకా నిర్ణయం జరగలేదని, త్వరలోనే తెలుస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.