FbTelugu

ఉచితంగా కరోనా వ్యాక్సిన్: కేంద్ర మంత్రి హర్షవర్థన్

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ రాష్ట్రంలోనే కాదు ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్థన్ ప్రకటించారు.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వ్యాక్సిన్ పంపిణీ కోసం జరిగిన డ్రై రన్ ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్వయంగా పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, వధంతులు నమ్మవద్దని, వ్యాక్సిన్ సమార్థక్యం, భద్రత, రోగ నిరోధకతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. గతంలో పోలియో వ్యాక్సిన్ పై కూడా ఇలాంటి దుష్ప్రచారం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఇవాళ దేశంలోని 116 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారని, నిజమైన వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప మిగతా మొత్తం ప్రక్రియలను అధికారులు పరిశీలిస్తున్నారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.