FbTelugu

తెలంగాణ లెక్క తేల్చిన కేంద్రం

ఇవేమి కరోనా పరీక్షలంటూ ఆగ్రహం

రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: కరోనా టెస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఆగ్రహంతో ఉంది. అవుననే విధంగా ‘ద ప్రింట్ ’ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది.

ఈ నెల 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 14 లక్షల నమూనాలను పరీక్షించగా, అందులో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే. ఇలా తక్కువ స్థాయిలో టెస్టులు చేస్తే వైరస్ నియంత్రించడం కష్టమని కేంద్రం స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ లేఖ రాశారు.

ఈ నెల 7వ తేదీన సుడాన్ రాష్ట్రానికి లేఖ రాసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. ఏపీలో ప్రతిరోజు సుమారు 9వేల పరీక్షలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో 200 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.

జాతీయ సగటు కన్నా తక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో 20 ప్రైవేటు ల్యాబులకు పరీక్షించేందుకు అనుమతించగా, కొన్నింటికే అనుమతించారు. ప్రైవేటు ల్యాబులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. దీనిపై ద ప్రింట్ ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేష్ కుమార్ వివరణ కోరేందుకు ప్రయతించగా అందుబాటులోకి రాలేదు. ఫోన్ కాల్ చేసినా, మెస్సేజ్ పంపించినా స్పందించలేదు.

You might also like