FbTelugu

రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ: రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రెమిడెసివిర్ సంబంధిత ఔషధాల ఎగుమతులపై కూడా ఈ నిషేధం ఉంటుందని తెలిపింది.

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేసుల ఉధృతి దృష్ట్యా భవిష్యత్తులో రెమిడెసివిర్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ మందు ను ఉత్పత్తిదారులు, పంపిణీదారులు నిల్వ చేయవద్దని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న ఔషధ నిల్వల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. రెమిడెసివిర్ నిల్వలు నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. నల్లబజారుకు వెళ్లకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి కేంద్రం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.