FbTelugu

43 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనా దేశానికి చెందిన మొబైల్ యాప్ లను వరుసగా నిషధిస్తూ వస్తున్నది. ఇవాళ మరో 43 చైనా యాప్ లపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆదేశాలు జారీ చేసింది.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 43 మొబైల్‌ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ కేంద్రం నుంచి వచ్చిన సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం నిషేధపు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది.

తాజాగా నిషేధించిన 43 యాప్ లలో అలీఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీ ఉన్నాయి. ఈ యాప్‌లలో చైనా రిటైల్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని ఉన్నాయి. గల్వాన్ లోయ వద్ద దుందుడుకు చర్యలకు దిగిన చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత ప్రభుత్వం గతంలో రెండు సార్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.