FbTelugu

జర్నలిస్టులు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్: కేంద్రం

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ గా గుర్తిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్‌ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ పాటించాలని కోరారు.

ఇవాళ లవ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని ఆయన వివరించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని లవ అగర్వాల్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.