FbTelugu

ట్విటర్ పై కేసు పెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: అదను కోసం చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ చిక్కింది. మతపరమైన హింసను ప్రోత్సహించారంటూ ఉత్తరప్రదేశ్ ఘజియామాబాద్ లో ట్విటర్ పై కేసు నమోదు అయింది. ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కావాలని కేంద్రం తాఖీదు జారీ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఐటి నిబంధనలు అమలు చేసేందుకు ట్విటర్ ససేమిరా అంటోంది. ఫేస్ బుక్, యూ ట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, గూగుల్ సంస్థలు అంగీకరించగా, ట్విటర్ బేఖాతర్ చేస్తోంది. తుది హెచ్చరికను కూడా పాటించకపోవంతో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విటర్ కోల్పోయింది. దీంతో ఇకపై భారత పట్టాల పరంగా చర్యలు తీసుకోవడాని అవకాశం ఏర్పడింది. జూన్ 5వ తేదీన ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మంగళవారం రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన తొలి కేసు నమోదు చేశారు.

తనపై తప్పుడు ప్రచారం చేశారని బాధితుడు ఫిర్యాదు చేసినా ట్విటర్ పట్టించుకోలేదని ఆరోపించారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించలేదని తెలిపారు. మతపరమైన హింసను ప్రోత్సహించారంటూ పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటి నిబంధనలు పాటించని ఏకైక సంస్థ ట్విటర్ అని కేంద్ర ఐటి శాఖ ప్రకటించింది. ట్విటర్ వివాదం రోజుకో మలుపు తిరిగి మసకబారే స్థితికి చేరుకునే ప్రమాదముందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ట్విటర్ కు ప్రత్యామ్నాయంగా దేశంలో కూ యాప్ ను అభివృద్ధి చేశారు కూడా. కేంద్రంలోని పెద్దలు ఈ యాప్ వినియోగాన్ని పెంచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.