FbTelugu

ఉద్యోగులకు కేంద్రం షాక్..

తాజా ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న కేంద్రం

ఢిల్లీ: భారీ పరిశ్రమలు, బడా కంపెనీలకు ఆర్థికంగా ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఆ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది.

లాక్‌డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. ఉద్యోగులకు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. దీంతో భారీ పరిశ్రమలకు, కంపెనీలకు ఆర్థికంగా లాభం చేకూర్చింది.

లాక్‌డౌన్‌ కారణంగా తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేమని ఓ పరిశ్రమ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 15న సుప్రీంకోర్టు విచారించింది. జీతాలు చెల్లించలేని సంస్థలపై వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

లాక్ డౌన్ సమయంలో కంపెనీ పనిచేయదని, ఆదాయం కూడా లేని కంపెనీలు ఈ సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కష్టమవుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ ఆదేశాలపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని, వాటన్నింటికి సమాధానం వెతకాలని కేంద్రానికి సూచించింది. అంతేకాకుండా చిన్న, మధ్య తరహా కంపెనీలకు ప్రభుత్వ సహకారం లేకపోతే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.