FbTelugu

ఏపీ సీఎస్ వేటుపై కేంద్రం సీరియస్

Center-Serious-on-AP-CS-Sacks

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమకం?

ఢిల్లీ: ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వేటుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వేటుకు గల కారణాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది. వైఎస్. జగన్ వైఖరితో ఆగ్రహంతో ఉన్న ఎల్వీ.సుబ్రహ్యణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఆయన సర్వీసులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలనే ఆలోచననంలో ఉంది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనతో ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో ఒత్తిడి పెరిగింది. ఒక ప్రధాన కార్యదర్శి పైనే సీఎం జగన్ ఇలా వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు

You might also like