FbTelugu

తూచ్… ఎన్.440కె వైరస్ లేనే లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని పలువురు వైద్య నిపుణులు ఎన్.440కె వైరస్ ప్రవేశించిందని, వేగంగా వ్యాప్తి చెందుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నదని కోడై కూస్తుండగా, కేంద్ర ప్రభుత్వం అదేమి లేదంటూ కొట్టిపారేస్తున్నది

దేశంలో కొత్తగా గుర్తించిన బి.617 మినహా ప్రస్తుతం కొత్త వైరస్‌ రకాలేమీ లేవని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్న ఎన్.440కె రకం వైరస్‌పై పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ప్రచురించ లేదన్నారు. వైరస్‌ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు ఎన్.440కె రకం ఉన్నట్లు బయటపడింది. ఎందుకో గాని అది చాలా వేగంగా అంతర్థానమైందని, దాని విస్తరణ జడలు కన్పించడం లేదని ఆమె వివరించారు. అయితే దీంట్లో క్లినికల్‌ ప్రభావం ఏమీ కనిపించలేదని అన్నారు. ప్రస్తుతం బి.617 వైరస్‌ రకమే వేగంగా వ్యాపిస్తూ, రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదన్నారు. సెకండ్ వేవ్ లో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, యుకె, భారత్‌ రకాల వైరస్‌లు మాత్రమే ఉన్నట్లు రేణూస్వరూప్‌ చెప్పారు. ఏపిలో ఎన్.440కె ప్రవేశించడం మూలంగానే పగలు కూడా కర్ఫ్యూ విధించారని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయడు కూడా ఈ వైరస్ ప్రవేశించిందని, పూర్తి లాక్ డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.